CM Jagan: దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌.. పెట్టుబడుల తీసుకురావడమే టార్గెట్..

|

May 19, 2022 | 9:05 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు. రెండేళ్ల..

CM Jagan: దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌.. పెట్టుబడుల తీసుకురావడమే టార్గెట్..
Ap Cm Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు. రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం జరుగుతోంది. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్‌ వేదికగా సీఎం జగన్‌ కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలనుకూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.