Ayyannapathrudu: మాజీ మంత్రి అయన్న పాత్రుడు సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

|

Apr 18, 2022 | 8:02 AM

మాజీ మంత్రి అయన్న పాత్రుడు పోలీసులు, అధికార పార్టీ నేతలపై రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్న .. ఆయన కుమారుడిపై కేసు నమోదుచేశారు పోలీసులు.

Ayyannapathrudu: మాజీ మంత్రి అయన్న పాత్రుడు సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Ayyanna Patrudu
Follow us on

Case files on Ayyannapathrudu: మాజీ మంత్రి అయన్న పాత్రుడు పోలీసులు, అధికార పార్టీ నేతలపై రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్న .. ఆయన కుమారుడిపై కేసు నమోదుచేశారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండగ పెద్ద జాగారం సందర్భంగా 15న అబీద్‌ కూడలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయన్నపాత్రడు పాల్గొన్నారు. మరిడిమాంబ జాతరలో పోలీసులకు, అయ్యన్న పాత్రుడి వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రాత్రి 11.10గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌, తదితరులు పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దూషించారని పేర్కొంటూ సెక్షన్‌ 353, 294(ఎ, బి), 504, 505 (ఎ, బి), 506, రెడ్‌విత్‌ 34కింద కేసు నమోదు చేశారు. నాతవరం ఎస్సై డి.శేఖరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం ఎస్సై నారాయణరావు పేర్కొన్నారు.

జాతరలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు పర్మిషన్ తీసుకున్నప్పటికీ పోలీసులు ఆటకం కలిగించారన్న ఆగ్రహంతో పోలీసులను, విజయసాయిరెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో జాతర బ్రహ్మాండంగా జరగకూడదని విజయసాయిరెడ్డి పోలీసులను రెచ్చగొడుతున్నారంటూ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు అయ్యన్న.

దీంతో ఆ౦క్షలను బేఖాతరు చేశారని.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ తోపాటు మరో తొమ్మది మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేశారంటూ 304, 305, 188, 204 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జాతరతో ఏర్పాటు చేసిన ప్రొగ్రామ్స్ ను త్వరగా ముగించాలని పోలీసులు కోరడంతో అయ్యన్న నానా హంగామా సృష్టించారని కేసులు పెట్టారు.

Read Also….  Russia Ukraine War: రష్యా దాడిలో భారీ ఉక్కు కర్మాగారం ధ్వంసం.. లొంగిపోవాలన్న రష్యా డెడ్‌లైన్‌‌కు బెదిరెదీలే అంటున్న ఉక్రెయిన్