AP Cabinet: రేపు (మార్చి 3వ తేదీన) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా వేసిన ఈ సమావేశాన్ని ఈ నెల 7వ తేదీన(సోమవారం) తిరిగి నిర్వహించనున్నామని సీఎస్ కార్యాలయం ప్రకటించింది. సోమవారం(మార్చి 7వ తేదీ) మధ్యాహ్నం 12గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగనున్నామని అధికారులు తెలిపారు. దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమం దృష్ట్యా కేబినెట్ మీటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
అయితే శాసన సభ సమావేశాలు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 7న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే.. మద్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన ఈ మార్పులను గమనించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం సూచించింది.
Also Read: