నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. మహిళల అకౌంట్లలోకి డబ్బులు..
ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు. 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం తెలిపింది. ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.
ఏపీ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరిగింది. డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్‌లపై చర్చించారు. దాదాపు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు.