
Snake Bite: ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులకు పాము కాటేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్న సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న చిన్నారులకు పాము కాటేసిన విషయం తెలియక విషం ఒళ్లంత పాకేసింది. దీంతో వారికి కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా, ఇద్దరు చిన్నారుల్లో తమ్ముడు మార్గమధ్యలోనే చనిపోగా, అన్న పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కండ్ల గూడూరు గ్రామానికి చెందిన వీర నారాయణ స్వామి, లక్ష్మీ దంపతుల కుమారులైన శివ నారాయణ (9), అన్న శివరామరాజు (11). ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. దీంతో వారు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా, తల్లిదండ్రులు వారిని పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే శివ నారాయణ మృతి చెందాడు. ప్రస్తుతం శివరామరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఈ చిన్నారులకు పాము కాటేసిన విషయం తమకు తెలియదని, కడుపు నొప్పి రావడంతో్ ఆస్పత్రికి తరలించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో విషం ఒళ్లంత పాకడంతో వారి పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి