
మీ ఓటుహక్కు బీఎల్ఓ గుప్పిట్లోనే.. ఇలా చేస్తే మీ ఓటుకు నో ఢోకా, ఆన్‌లైన్‌లో ఫామ్ ఫిలప్ చెయ్యడం ఎలా? ఎన్యుమరేషన్ ఫామ్‌లో ఆ తప్పు చేస్తే అంతే సంగతులు..! అడ్రస్ మారినవాళ్ల ఓట్లు గల్లంతేనా..? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఇలా కన్నింగ్ అండ్ కర్సివ్ థంబ్‌నెయిల్స్‌తో కవ్విస్తూ కావల్సినంత సొమ్ము చేసుకుంటున్నారు యూట్యూబర్లు. రీల్సూ, పాడ్‌కాస్ట్ వీడియోలు, ప్రజెంటేషన్లతో అదేపనిగా ఊదరగొడుతున్నాయి లీడింగ్ మీడియా కంపెనీలు. ఎస్‌ఐఆర్ మీద తెలుగులో వచ్చిన అవేర్‌నెస్ వీడియోలు ఇప్పటిదాకా ఆరున్నర కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకున్నట్లు ఓ లెక్కుంది. అన్ని రకాల మీడియాల్లో ఇంత ర్యాపిడ్‌గా అవగాహన కల్పిస్తున్నా, ఇటు ఓటర్లలో అటు అధికారుల్లో టన్నులకొద్దీ అలసత్వం. గ్రౌండ్‌లెవల్‌లో పెర్ఫామెన్స్ రిపోర్టులు చాలా పేలవంగా ఉంటున్నాయి. ప్రస్తుతానికి సర్ ప్రక్రియ ఒక చిన్నసైజు సంక్షోభాన్ని తలపిస్తోంది. పరేషాన్లు ఇలాగే కంటిన్యూ ఐతే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండున్నర కోట్ల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని అంచనా కట్టింది ఒక సర్వే సంస్థ. సరిగ్గా, ఇక్కడే పొలిటికల్ పార్టీల్లో ఉలికిపాటు. ఎస్‌ఐఆర్‌పై అంతులేని హైరానా మొదలైంది. ఏపీలో ఓట్ల వడబోత దాదాపు క్లయిమాక్స్‌లో పడ్డట్టే. ఈసీ పెట్టిన డెడ్‌లైన్‌కు మహా ఐతే ఇక నాలుగురోజులే గ్యాపుంది. 14వ...