AP: వినుకొండలో బయటపడిన పురాతన లోహపు రాళ్లు.. గుప్త నిధులంటూ ప్రచారం.. చివరకు

|

Jan 21, 2022 | 2:02 PM

Ancient Metal Stones: గుంటూరు జిల్లాలోని వినుకొండ కొండ వద్ద నున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల్లో

AP: వినుకొండలో బయటపడిన పురాతన లోహపు రాళ్లు.. గుప్త నిధులంటూ ప్రచారం.. చివరకు
Vinukonda
Follow us on

Ancient Metal Stones: గుంటూరు జిల్లాలోని వినుకొండ కొండ వద్ద నున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రహారి గోడ నిర్మాణం కోసం కూలీలు గుంతలు తవ్వడం ప్రారంభించారు. ఈ పనులు జరుగుతుండగా.. కుండ, అందులో కొన్ని లోహపు రాళ్ళు బయడ పడ్డాయి. దీంతో గుప్త నిధులు బయడ పడ్డాయన్న ప్రచారం ముమ్మరంగా జరిగింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని వాటిని చూసేందుకు ఎగబడ్డారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పురావస్తు శాఖ అధికారులకూ సమాచారం ఇచ్చారు.

పురావస్తు శాఖ డిడి సురేష్ వినుకొండ లోని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి తవ్వకాల్లో బయట పడిన కుండ, కుండలో ఉన్న లోహాన్ని పరిశీలించారు. కుండ మధ్యయుగ కాలం నాటిదని చెప్పారు. కుండలో ఉన్న లోహం సీసం, కాపర్ కలిపి తయారు చేసిన ముద్దగా భావిస్తున్నామన్నారు. మైనింగ్ శాఖకు వాటిని అప్పగించి ఏఏ లోహ పదార్థాలున్నాయో కనుక్కుంటామన్నారు.

Vinukonda Guntur

ఆది మానవులు ఈ పరిసరాల్లో సంచరించారన్న ఆనవాళ్ళు ఉన్నాయని సురేష్ తెలిపారు. మొత్తం మీద కుండలో ఉన్నం లోహం విలువైదని కాదని వాడగా మిగిలిన లోహాన్ని కుండలో భద్రపరిచి ఉండవచ్చని ఆయన తెలిపారు. అయితే.. పురావస్తు శాఖ అధికారుల ఈ ప్రకటనతో గుప్త నిధుల పేరుతో వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది.

టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు.

Also Read:

Trains Cancelled: కోవిడ్ విజృంభణ.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైళ్లన్నీ రద్దు..

AP Politics: కేసినో రచ్చ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ.. మధ్యలో పోలీసులు.. గుడివాడలో హైటెన్షన్..