Bapatla: వందల ఏళ్లనాటి రాగి శాసనాలు.. డీకోడింగ్ చేయగా.. ఆశ్చర్యగొలిపే విషయాలు

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారంలో లభించిన రాగి శాసనాల డీకోడింగ్ పూర్తైంది. ఏఎస్ఐ మైసూరు శాఖ పరిశీలనలో శాసనాల్లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. శ్రీశైల భ్రమరాంబ–మల్లిఖార్జున దేవాలయానికి మెట్ల నిర్మాణం చేశారనే వివరాలను శాసనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ...

Bapatla: వందల ఏళ్లనాటి రాగి శాసనాలు.. డీకోడింగ్ చేయగా.. ఆశ్చర్యగొలిపే విషయాలు
Inscription

Edited By:

Updated on: Nov 20, 2025 | 1:20 PM

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారంలో కొన్నేళ్ల కిందట రాగి శాసనాలు లభించాయి. వాటిని భద్రపరిచిన విద్యాసాగర్ అందులో లిపి ఏంటో గుర్తించలేకపోవడంతో వాటిని ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా మైసూరు శాఖకు అప్పగించారు. అందులో ఉన్న అంశాలను ఢీ కోడింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే.. అందులో ఉన్న అంశాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డీకోడింగ్ చేసింది.

రాగి శాసనాల్లో ఆసక్తికర అంశాలున్నట్లు ఏఎన్ఐ డైరెక్టర్ ముని రత్నం రెడ్డి తెలిపారు. శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున దేవాలయానికి మెట్ల నిర్మాణం చేసిన అంశాన్ని రాగి శాసనాల్లో పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. వీటితో పాటు కొండవీడు రెడ్డి రాజుల వంశ వృక్షం కూడా ఉందన్నారు. రెడ్డి రాజ్య స్థాపన వద్ద నుంచి చివరి వరకూ పాలించిన రాజుల ఎవరూ అన్న అంశాలు ఉన్నాయన్నారు. శాసనాలన్నీ కూడా సంస్కృతం, తెలుగు లిపిల్లోనే ఉన్నాయన్నారు. వేద పండితులంతా కలిసి 1405లో అప్పటి రెడ్డి రాజులకు ఈ శాసనాలను అందించినట్లు ఆయన చెప్పారు. ఆనాటి రెడ్డి రాజులు వాటిని భద్రపరిచినట్లు తెలిపారు. ఐదు రేకులున్న శాసనాలు పొన్నవోలు గ్రామస్తులు ఏఎస్ఐ అప్పగించారన్నారు. అయితే ఈ శాసనాలను మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు మున్నిరత్నం రెడ్డి తెలిపారు. పూర్తి సమాచారం డీకోడ్ చేసిన తర్వాత మరిన్ని చారిత్రక ఆధారాలు లభ్యమవుతాయన్నారు. చందోలు, చేబ్రోలు ప్రాంతాల్లో అనేక చారిత్రక ఆధారాలు గతంలో బయటపడ్డాయి. ఈ క్రమంలోనే వెలుగు చూసిన రాగి శాసనాలను విద్యా సాగర్ ఏఎస్ఐ‌కు అందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.