Andhra Pradesh: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఎస్పీ ఫక్కీరప్ప. అయితే, ఈ కేసులో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఒరిజినల్ వీడియో దొరికితే.. అది సాధ్యమవుతుందన్నారు. వీడియో ఒరిజినలా? ఫేకా? అనేది తేలితేనే.. ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు ఎస్పీ. అందుకే వీడియోను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదని చెప్పారు. వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడానికి ముందు.. ఐదుగురు వ్యక్తులు ఫార్వడ్ చేశారని చెప్పారు ఎస్పీ. ఆ ఎక్స్ వై జెడ్ ఎవరనే విషయంలో క్లారిటీ వస్తే.. అన్ని నిజాలూ బయటకు వస్తాయన్నారు. మొదట ఐ-టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో షేర్ అయ్యిందని ఎస్పీ పకీరప్ప తెలిపారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్‌లోడ్ అయ్యిందన్నారు. వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వీడియో ఒరిజినల్ అవునా? కాదా? అనేది నిర్ధారించలేకపోతున్నట్లు వెల్లడించారు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అనేదానిపై సందేహాలు ఉన్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలన్నీ నిజం కాదన్నారు.