HP Gas Cylinder: గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనంగా రూ.30 చెల్లించాలని డిమాండ్‌.. ఫిర్యాదు చేయగా రూ.లక్ష చెల్లించుకున్నాడు!

|

Jan 15, 2023 | 6:47 AM

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుడిని అదనంగా రూ.30 అడగటంతో కోర్టు శుక్రవారం (జనవరి 13) ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది. సేవాలోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్‌ ఏజెన్సీ ఏకంగా..

HP Gas Cylinder: గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనంగా రూ.30 చెల్లించాలని డిమాండ్‌.. ఫిర్యాదు చేయగా రూ.లక్ష చెల్లించుకున్నాడు!
HP Gas
Follow us on

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుడిని అదనంగా రూ.30 అడగటంతో కోర్టు శుక్రవారం (జనవరి 13) ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది. సేవాలోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్‌ ఏజెన్సీ రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని తీర్పు నిచ్చింది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురానికి చెందిన ఓ వినియోగదారుడు 2019 అక్టోబరు 7న రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నారు. గుత్తిరోడ్డులోని హనుమాన్‌ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్‌ నుంచి డెలివరీ బాయ్‌ గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అనంతరం అదనంగా రూ.30 ఇవ్వాలని డెలివరీ బాయ్‌ కోరాడు. ఇవ్వనని వినియోగదారుడు చెప్పడంతో డెలివరీ బాయ్‌ సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లాడు. దీంతో వినియోగదారుడు పౌర సరఫరాల అధికారిని సంప్రదించడంతో తిరిగి సిలిండర్‌ను ఇంటిముందు ఉంచి వెళ్లిపోయారు. ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లగా సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని అడుగుతుంటారని డెలివరీ బాయ్‌ చేసిన దాన్ని సమర్థించారు. అనంతరం ఫిర్యాదు చేసిన
వినియోగదారుడిని మరో ఏజెన్సీకి బదిలీ చేశారు.

ఏజెన్సీని మార్చడంపై సదరు వినియోగదారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. సిలిండర్‌ లేకపోవడంతో పడిన ఇబ్బందులను తెలియజేస్తూ జిల్లా వినియోగదారుల ఫోరానికి తన ఫిర్యాదులో రాత పూర్వకంగా పేర్కొన్నాడు. దీంతో ఫోరం గ్యాస్‌ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీచేసింది. దీనిపై విచారణ చేపట్టగా.. డెలివరీ బాయ్‌ను తొలగించినందున పరిహారం చెల్లించాల్సి అవసరం లేదని ఏజెన్సీ తెల్పింది. ఐతే ఏజెన్సీ తీరును తప్పుబట్టిన ఫోరం బెంచ్‌.. రూ.లక్ష పరిహారం ఏజెన్సీనే చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు ఎం.శ్రీలత శుక్రవారం తీర్పునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.