అర్చక లోకానికి తీరని విషాదం, ఆగమ శాస్త్రానికి పూడ్చలేని లోటు, 75 ఏళ్లపాటు శ్రీవారి సేవలో తరించిన భట్టాచార్య

|

Feb 17, 2021 | 11:57 AM

తిరుపుల తిరుపతి దేవస్థానం రెసిడెంట్ ఆగమ సలహాదారులు సుందరవదన బట్టాచార్యులు ఆకస్మికంగా మృతిచెందారు. నెల్లూరులో వసంత పంచమి వేడుకలకు..

అర్చక లోకానికి తీరని విషాదం, ఆగమ శాస్త్రానికి పూడ్చలేని లోటు, 75 ఏళ్లపాటు శ్రీవారి సేవలో తరించిన భట్టాచార్య
TTD
Follow us on

తిరుపుల తిరుపతి దేవస్థానం రెసిడెంట్ ఆగమ సలహాదారులు సుందరవదన బట్టాచార్యులు ఆకస్మికంగా మృతిచెందారు. నెల్లూరులో వసంత పంచమి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లిన సుందరవదన భట్టాచార్యులు.. గుండెపోటుతో మృతి చెందారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న సరస్వతి పూజకు తమ బృందంతో వెళ్లిన భట్టాచార్య సాయంత్రం 6.15 గంటలకు గోపూజ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. అక్కడ ఉన్నవారు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా మారింది. సుందరవదన ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది. అయినా ప్రాణాలు దక్కలేదు.

తీవ్ర గుండె పోటు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన ఆకస్మిక మృతితో విషాదంలోకి వెళ్లారు అర్చకులు. టీటీడీ సీనియర్‌ అర్చకుడు, ఆగమ సలహామండలి సభ్యుడు ఎన్‌ఏకే సుందరవదన భట్టాచార్యులు దాదాపు 75 ఏళ్లుగా శ్రీవారి సేవలో తరించారు. టీటీడీలో ఎంతో కాలంగా సేవలందిస్తున్న ఆయన మృతికి అర్చకులు సంతాపం వ్యక్తం చేశారు. సుందరవదన మృతి తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు. ఎంతో అపారమైన అనుభవం ఉన్న అర్చకులుగా.. ఆగమ సలహా మండలి సభ్యులుగా ఆగమ శాస్త్ర ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు సుందరవదన భట్టాచార్యులు.

Read also : నేడు కేసీఆర్ పుట్టినరోజు : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు