
అనంతపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గాంధీనగర్‌కు చెందిన కార్తీక్‌ని ఎత్తుకు పోయి చితక బాదారు. అనంతరం కార్తీక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. రూ.5 లక్షలు శనివారం మధ్యాహ్నం లోపు ఇవ్వకుంటే చంపేస్తామంటూ కిడ్నాపర్లు వార్నింగ్ ఇచ్చారు.
కర్నాటక చెక్ పోస్ట్ వద్దకు డబ్బులు తీసుకురావాలని హెచ్చరించారు. అంతేకాకుండా కార్తీక్‌ను చితకబాదిన వీడియోను అతని చెల్లెలుకు పంపించారు. దీంతో బెంగళూరులో ఉంటున్న అతని చెల్లెలు ధర్మవరానికి వచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కార్తీక్ ఆచూకీ కోసం అన్ని చెక్ పోస్టుల వద్ద గాలిస్తున్నారు.