Watch Video: తెల్లవారుజామున నిద్ర మత్తులో ప్రయాణికులు.. బస్సులో హఠాత్తుగా చెలరేగిన మంటలు! ఈ తర్వాత..

ఆదివారం తెల్లవారుజామున త్రుటిలో మరో బస్సు ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు ఎయిర్ పైప్ లీక్ అవ్వడం తో టైర్లు హీట్ ఎక్కి పోగలు వచ్చాయి. సిబ్బంది వెంటనే గమనించడంతో టోల్‌ సిబ్బంది బస్సు నిలిపివేసింది. టోల్ పైకి లేకపోవడంతో..

Watch Video: తెల్లవారుజామున నిద్ర మత్తులో ప్రయాణికులు.. బస్సులో హఠాత్తుగా చెలరేగిన మంటలు! ఈ తర్వాత..
Bus Fire At Keesara Toll Gate

Updated on: Nov 16, 2025 | 10:15 AM

కీసర, నవంబర్‌ 16: ఆదివారం తెల్లవారుజామున త్రుటిలో మరో బస్సు ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు ఎయిర్ పైప్ లీక్ అవ్వడం తో టైర్లు హీట్ ఎక్కి పోగలు వచ్చాయి. సిబ్బంది వెంటనే గమనించడంతో టోల్‌ సిబ్బంది బస్సు నిలిపివేసింది. టోల్ పైకి లేకపోవడంతో పోగలు గమనించిన టోల్ సిబ్బంది డ్రైవర్ కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌ బస్సును ఆపుచేసి హుటాహుటీన ప్రయాణికులను కిందకి దించడంతో ప్రమాదం తప్పింది.

మరోవైపు కీసర టోల్ గేట్ వద్దనే కంచికచర్ల ఎస్ ఐ విశ్వనాథ్ డ్యూటీ చేస్తున్నాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్ ఐ విశ్వనాథ్ బస్సులో మంటలు వచ్చిన సమాచారం తెలుసుకోకుండా జీప్ లో నిద్రపోతున్నాడు. అక్కడే పోలీస్ వాహనంలో నిద్రపోతున్న ఎస్ఐ విశ్వనాథ్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. బస్సుల్లో ఉన్న ప్రయాణికులను డ్రైవర్ మరో బస్సులో పంపించాడు. అప్రమత్తంగా లేకుంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఏంటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. టోల్ గేట్ సిబ్బంది అప్రమత్తత వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పినట్లైంది. అసలు బస్సు టోల్గేట్ వద్ద ఆగి ఉండకపోతే, సిబ్బంది గమనించి ఉండటకపోతే ఊహించని ప్రమాదం జరిగేదని ప్రయాణికులు అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.