‘‘తండ్రి సైగ చేసి ఉంటారు’’.. లోకేశ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్

ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వస్తోన్న నారా లోకేశ్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం […]

‘‘తండ్రి సైగ చేసి ఉంటారు’’.. లోకేశ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్

Edited By:

Updated on: Jul 06, 2019 | 3:07 PM

ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వస్తోన్న నారా లోకేశ్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఓ ట్వీట్ చేశారు.

‘‘లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయి ఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు’’ అని విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.