ఆయనను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరవరు: విజయసాయి రెడ్డి

| Edited By:

Jul 08, 2019 | 10:28 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు. ‘‘వరుస కరువులతో కుదేలైన వ్యవసాయ రంగానికి ఊపిరి పోశారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలతో పాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టారు. ఆయన సీఎంగా ఉన్నన్నాళ్లు వరుణ దేవుడు పిలవకుండానే పలికే వాడు. సీఎంగా చెరగని ముద్ర వేసిన మహనీయుడు […]

ఆయనను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరవరు: విజయసాయి రెడ్డి
Follow us on

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

‘‘వరుస కరువులతో కుదేలైన వ్యవసాయ రంగానికి ఊపిరి పోశారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలతో పాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టారు. ఆయన సీఎంగా ఉన్నన్నాళ్లు వరుణ దేవుడు పిలవకుండానే పలికే వాడు. సీఎంగా చెరగని ముద్ర వేసిన మహనీయుడు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 70వ జయంతి నిజంగా పండుగ దినం’’.


‘‘ఆరోగ్య శ్రీ, 108అంబులెన్స్‌లు ప్రవేశ పెట్టిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఫీజు చెల్లింపు పథకంలో పేదల చదువుల కలలను నిజం చేసిన చిరస్మరణీయుడు. రాజన్న పిలిస్తే పలుకుతాడు అనే ధైర్యంప్రజలకు కల్పించిన మహా మనిషి ఆయన’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.