విజయసాయికి మళ్లీ అదే పదవి..బట్ నో శాలరీ

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఏపీ  సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. గతంలో విజయసాయిరెడ్డిని ఇదే పదవిలో నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జీవో కూడా జారీ చేశారు. అయితే, రెండు లాభదాయక పదవుల్ని చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వ తేదీన రద్దు చేసింది. తాజాగా […]

విజయసాయికి మళ్లీ అదే పదవి..బట్ నో శాలరీ

Updated on: Jul 07, 2019 | 8:43 PM

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఏపీ  సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. గతంలో విజయసాయిరెడ్డిని ఇదే పదవిలో నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జీవో కూడా జారీ చేశారు. అయితే, రెండు లాభదాయక పదవుల్ని చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వ తేదీన రద్దు చేసింది.

తాజాగా ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్‌ తదితర హోదా లేకుండా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించేందుకు వీలుగా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వస్తే… ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గౌరవించాలని అందులో ఆదేశించింది.