జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా..?..బిగ్ న్యూస్-బిగ్ డిబేట్

వైసీపీ, జనసేన మధ్య ఇసుకతో మొదలైన వివాదం.. ఇంగ్లీష్‌ దగ్గరకు వచ్చేటప్పటికి వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. పవన్‌ మూడుపెళ్లిళ్లు చేసుకున్నారని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యానిస్తే, తన పెళ్లిళ్లవల్లే జగన్‌, విజయసాయిరెడ్డి జైలుకెళ్లారా అంటూ పవన్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండుపార్టీల అధినేతల మధ్య ఇప్పుడు మాటల యుద్దం నడుస్తోంది. జనసేన, టీడీపీ ఒకటేననీ.. పవన్‌ దత్తపుత్రుడని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. పవన్ మాత్రం తన ఎజెండా ప్రజాసంక్షేమమే అని తేల్చి చెబుతున్నారు. వైసీపీ, జనసేన అధినేతల […]

జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా..?..బిగ్ న్యూస్-బిగ్ డిబేట్

Updated on: Nov 12, 2019 | 10:14 PM

వైసీపీ, జనసేన మధ్య ఇసుకతో మొదలైన వివాదం.. ఇంగ్లీష్‌ దగ్గరకు వచ్చేటప్పటికి వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. పవన్‌ మూడుపెళ్లిళ్లు చేసుకున్నారని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యానిస్తే, తన పెళ్లిళ్లవల్లే జగన్‌, విజయసాయిరెడ్డి జైలుకెళ్లారా అంటూ పవన్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండుపార్టీల అధినేతల మధ్య ఇప్పుడు మాటల యుద్దం నడుస్తోంది. జనసేన, టీడీపీ ఒకటేననీ.. పవన్‌ దత్తపుత్రుడని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. పవన్ మాత్రం తన ఎజెండా ప్రజాసంక్షేమమే అని తేల్చి చెబుతున్నారు. వైసీపీ, జనసేన అధినేతల మాటల వార్‌పై..బిగ్ న్యూస్-బిగ్ డిబేట్  వేదికగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్చ జరిగింది.

ఈ చర్చలో పాల్గొన్న టీడీపీ లీడర్ మాల్యాద్రి మాట్లాడుతూ..జగన్ విపక్ష నాయకులపై వ్యూహాత్మకంగానే వ్యక్తిగత విమర్శలు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఇసుక సమస్యపై ఈ నెల 14న చంద్రబాబునాయుడు భారీ స్థాయిలో దీక్ష చెయ్యబోతున్నందునే..దాన్ని డైవర్ట్ చెయ్యడానికే జగన్ తిట్ల పురాణానికి దిగారని మాల్యాద్రి పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్లు..బాధ్యాతాయుతంగా వ్యవహారించాలని కోరారు.