ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ!

|

Nov 23, 2019 | 12:03 AM

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన […]

ఇండియా మ్యాప్‌లో అమరావతి.. ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ!
Follow us on

ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ.. కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం రిలీజ్ చేసిన పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి క్యాపిటల్‌గా లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు క్యాపిటల్‌గా అమరావతిని చేర్చకపోవడం.. ఏపీ ప్రజలకే కాదు.. రాజధాని నిర్మాణం కోసం పునాది రాయి వేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అవమానకరమేనని స్పష్టం చేశారు.

ఇక పొలిటికల్ మ్యాప్‌లో అమరావతి మిస్సింగ్ అంశంపై కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టడమే కాకుండా.. మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రివైజ్డ్ మ్యాప్‌ను విడుదల చేసింది. కాగా, గల్లా జయదేవ్ లోక్‌సభలో ఈ అంశంపై పోరాడి.. అమరావతిని సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్‌లో చేర్చేలా చేసినందుకు నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు.