ఏపీ అసెంబ్లీలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

| Edited By:

Jul 17, 2020 | 12:19 PM

ఏపీ అసెంబ్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ మధ్యలో అసెంబ్లీలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా..

ఏపీ అసెంబ్లీలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌
Follow us on

ఏపీ అసెంబ్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ మధ్యలో అసెంబ్లీలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. తాజాగా అందులో పనిచేస్తున్న‌ ఆరుగురు ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో అసెంబ్లీలో కరోనా సోకిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ క్రమంలో వారు పనిచేస్తోన్న బ్లాక్‌ మొత్తం శానిటైజ్ చేశారు అధికారులు. అలాగే వీరితో కాంటాక్ట్ ఉన్న ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా అటు ఏపీ సచివాలయంలోనూ కరోనా ఆందోళన కలిగిస్తోంది. సచివాలయంలో పనిచేసే పలువురు కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉంటే గురువారం వరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 38,044కు చేరింది. వారిలో 19,393 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా., 492 మంది మృత్యువాత పడ్డారు.