‘చంద్రబాబు మెదడు ఎంత కుళ్లిపోయిందో..’

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, అవినీతికి తావులేకుండా ప్రజలంతా నా వాళ్లే అనే భావనతో సాగడమే జగనన్న రూటు అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

చంద్రబాబు మెదడు ఎంత కుళ్లిపోయిందో..

Updated on: Sep 07, 2020 | 8:27 PM

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, అవినీతికి తావులేకుండా ప్రజలంతా నా వాళ్లే అనే భావనతో సాగడమే జగనన్న రూటు అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనతి కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం జగన్ రికార్డులు అధిరోహిస్తున్నారని ఆయన అన్నారు. దీంతో ప్రజాదరణ పెరుగుతోందని, జగన్ పాలనకు ప్రజల్లో వస్తున్న స్పందనలు చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘చంద్రబాబు గారూ… వయసుతో పాటు మీ మెదడు ఎంత కుళ్లిపోయిందో అర్థం కావడంలేదా? మీది పచ్చి రాజకీయ స్వార్థం కాదా? చెదురుమదురు ఘటనలను దళితులపై దాడులు గానూ, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారం చేసి లబ్ది పొందాలనుకోవడం లేదా? ఏదో రకంగా చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా?’ అంటూ సజ్జల తాజాగా రాష్ట్రంలో నెలకొన్న సంఘటనలపై తీవ్రంగా స్పందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us