CM Chandrababu: సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!
Pawan Kalyan, PM Modi, Chandrababu

Updated on: Apr 20, 2025 | 10:36 AM

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని… భవిష్యత్‌ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనితర సాధ్యుడు చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయన ఎక్స్‌ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపచేయడం ఆయన వంటి దార్శనికుడికే సాధ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు విజన్‌, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని తెలిపారు. భవిష్యత్తు అంచనా వేసి ఆయన వ్యవస్థలను నడిపించే విధానం అందరికి స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మాజీ సీఎం జగన్‌, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను అటు ఏపీ ఇటు తెలంగాణల్లో ఘనంగా నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అధినేత బర్త్‌డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి చంద్రబాబుపై రూపొందించిన పాటను నేతలు ఆవిష్కరించనున్నారు. “స్వర్ణాంధ్ర సారధి చంద్రబాబు” పేరుతో రూపొందించిన అసెంబ్లీ ప్రసంగాల పుస్తకాన్ని అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆవిష్కరిస్తారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాజరవుతారు. చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై టీడీ జనార్దన్, పూల విక్రమ్ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..