ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సభకు అనుమతిని నిరాకరించిన పోలీసులు.. కన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కన్నా ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. పల్నాడులో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడం తప్పా అని మండిపడ్డ ఆయన.. ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేపడితే అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కన్నా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.