Gannavaram Airport: వర్షాలు, వరదల ఎఫెక్ట్‌.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ

|

Sep 03, 2024 | 6:52 AM

భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ఏపీలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.

భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇంకా వర్షం ముప్పు పొంచి ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ఏపీలో రైలు, బస్సు సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాల బాట పట్టారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విమానాలు లేక ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో… గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on