సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున

| Edited By:

Jan 09, 2020 | 11:33 AM

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అది ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర గతేడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. […]

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున
Follow us on

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అది ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర గతేడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. ముగింపు రోజు ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజల కోసం పలు హామీలను ప్రకటించారు. కాగా ఈ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు.. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు వైఎస్ జగన్. ఈ క్రమంలో గత ఏడాది మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన. ఆ తరువాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ ప్రతిష్టాత్మక ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం జగన్.