సీఎం జగన్ మార్క్: ఇక నుంచి శనివారం ‘నో బ్యాగ్ డే’

|

Jun 01, 2019 | 2:46 PM

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన జగన్.. తన మార్క్ చూపిస్తున్నారు. పలు శాఖల్లో ప్రక్షాళన చేస్తూ ఏపీలో మార్పులు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు. పాఠశాల విద్యలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి పాఠశాలల్లో ప్రతి రెండో, నాల్గో శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యార్థులకు రోజు వారీ […]

సీఎం జగన్ మార్క్: ఇక నుంచి శనివారం నో బ్యాగ్ డే
Follow us on

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన జగన్.. తన మార్క్ చూపిస్తున్నారు. పలు శాఖల్లో ప్రక్షాళన చేస్తూ ఏపీలో మార్పులు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు. పాఠశాల విద్యలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి పాఠశాలల్లో ప్రతి రెండో, నాల్గో శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యార్థులకు రోజు వారీ పాఠాల బోధన, పుస్తకాలతో కుస్తీలను ఒక రోజు పక్కన పెట్టి.. ఆట పాటలతో ఉత్సాహ పరిస్తే..మిగతా వారమంతా చదువు పట్ల యాక్టీవ్‌గా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ప్రతిరోజు అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతలకు భిన్నంగా ఆట, పాటలతో వారిలో పాఠశాలంటే భయం పోగొట్టడం పాఠశాలలో వారిని ఆనందంగా ఉంచేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతోపాటు ఆనందవేదిక తరగతులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిరోజు ఉదయం అర్ధగంటపాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కూడ కొత్త సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తున్నారు. పిల్లలపై చదువుల భారం పెరగకుండా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.