నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీ మిర్చి రైతులకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ మిర్చి రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఊరటను ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో.. వ్యవసాయం, దాని

నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీ మిర్చి రైతులకు ఊరట

Updated on: May 15, 2020 | 7:14 PM

ఆంధ్రప్రదేశ్‌ మిర్చి రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఊరటను ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. రైతుల కోసం రూ.1లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన ఉండబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్‌ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం, బ్రాండ్లు కల్పించి మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం, ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి చేయబోతున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో మామిడి, జమ్ముకశ్మీర్‌లో కేసర్‌, ఈశాన్యంలో వెదురు, ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి, తమిళనాడులో కర్రపెండలం వంటి వాటిని ప్రోత్సహించనున్నట్లు నిర్మలా తెలిపారు.

Watch Live: లాక్‌డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం 

Loading...
Unable to load recommendations.
Follow Us