Krishna DCCB Recruitment: క‌ృష్ణా జిల్లాలోని ప్రభుత్వ బ్యాంక్‌లో జాబ్స్‌.. గ్రాడ్యుయేషన్‌ పాసైతే చాలు.. ఆదివారం లాస్ట్ డేట్

|

Jan 30, 2021 | 7:58 PM

ఏపీ గవర్నమెంట్‌కు చెందిన  మచిలీప‌ట్నంలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్ 118 పోస్టుల భ‌ర్తీకి అర్హులైన కృష్ణా జిల్లా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Krishna DCCB Recruitment: క‌ృష్ణా జిల్లాలోని ప్రభుత్వ బ్యాంక్‌లో జాబ్స్‌..  గ్రాడ్యుయేషన్‌ పాసైతే చాలు.. ఆదివారం లాస్ట్ డేట్
Follow us on

Krishna DCCB Recruitment: ఏపీ గవర్నమెంట్‌కు చెందిన  మచిలీప‌ట్నంలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్ 118 పోస్టుల భ‌ర్తీకి అర్హులైన కృష్ణా జిల్లా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనవరి 31 దరఖాస్తులకు ఫైనల్ డేట్. అసిస్టెంట్ మేనేజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ. 33 వేలు, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.24 వేల వేతనం ఉంటుంది.  https://krishnadccb.com/  వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు ఉన్న పోస్టుల సంఖ్య: 118

  1. అసిస్టెంట్ మేనేజ‌ర్: 28 పోస్టులు (మ‌హిళ‌ల‌ కేటగిరీ కింద 9 పోస్టులు ఉన్నాయి)
  2. స్టాఫ్ అసిస్టెంట్‌: 72 పోస్టులు (మ‌హిళ‌ల‌ కేటగిరీ కింద 26 పోస్టులు ఉన్నాయి)
  3. పీఏసీఎస్ స్టాఫ్‌: 18 పోస్టులు (మ‌హిళ‌ల‌ కేటగిరీ కింద 8 పోస్టులు ఉన్నాయి)

కృష్ణా జిల్లాకు చెంది గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త సాధించిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు‌. ఇంగ్లిష్‌, తెలుగులో ప్రావీణ్యం ఉండాలి.  కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉన్న అభ్య‌ర్థుల‌కు ఎక్కువగ ప్రాధాన్యత ఉంది. వయస్సు 01.01.2021 నాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, బీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలను ఈ వెబ్‌సైట్‌:https://krishnadccb.com/ ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోండి.

Also Read:

Bitcoin ban in india: బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారా..? అయితో మీకో షాకింగ్ న్యూస్.. త్వరలో బ్యాన్..!

Inter Practical Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త.. ప్రాక్టికల్స్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు