నా పెళ్లిళ్లు సరే..! ఇసుక మ్యాటరేంటి జగన్..?

|

Nov 12, 2019 | 6:12 PM

జనసేన అధినేత పవన్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై..ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ విషయాలపై.. ఇటీవలే పవన్ వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇదే అంశంపై పవన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో  నేడు భేటీ అయ్యారు. ఇసుకకు సంబంధించి 18 పాయింట్లతో గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. తదనంతరం విజయవాడ జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ […]

నా పెళ్లిళ్లు సరే..! ఇసుక మ్యాటరేంటి జగన్..?
Follow us on

జనసేన అధినేత పవన్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై..ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ విషయాలపై.. ఇటీవలే పవన్ వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇదే అంశంపై పవన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో  నేడు భేటీ అయ్యారు. ఇసుకకు సంబంధించి 18 పాయింట్లతో గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. తదనంతరం విజయవాడ జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పవన్ ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు: 

  • ప్రజల కష్టాల గురించి ప్రశ్నిస్తుంటే..నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు
  • ప్రతిసారి నా మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు.  వ్యక్తిగత పరిస్థితుల వల్ల అలా చేసుకోవాల్సి వచ్చింది. మీరు కూడా చేసుకోండి ఎవరొద్దన్నారు. నా మూడు పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా..?
  • ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల..నాలుగు నెలలకే రోడ్డు ఎక్కాల్సి వస్తోంది.
  • ఆజాద్ జయంతి వేడుకల్లో.. జగన్ మాట్లాడిన మాటలు అసలు సమస్యను పక్కదారి పట్టించడానికే..
  • ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తే..కాపులతో నాపై ఎదురుదాడి చేయిస్తున్నారు
  • సరైన ప్రణాళికలు రచించకుండా పాఠశాలల్లో..ఇంగ్లీషు మాధ్యమాన్ని ఎలా ప్రవేశపెడతారు..? ఈ విషయంలో మీరు చేసిన రీసెర్చ్ ఏంటి..? అసలు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారా..?
  • ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది
  • నాకు తెలుగే సంస్కారం నేర్పింది
  • ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాక ఏదో ఒక ప్రాంతంలో ఇంగ్లీషు మాధ్యమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టాలి
  • పొట్టి శ్రీరాములు స్పూర్తితో ఏపీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన విషయం గుర్తుంచుకోవాలి
  • మీ ఫ్యాక్షనిజానికి నేను భయపడే వ్యక్తిని కాదు
  • జగన్..ఉపరాష్ట్రపతి పదవికి కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు