ఆ ఇల్లు నాది కాదు: చంద్రబాబు

| Edited By: Srinu

Jul 18, 2019 | 11:49 AM

ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరును ప్రతిపక్షనేత చంద్రబాబు ఖండించారు. కేబినెట్‌ సమావేశం కోసం అసెంబ్లీని వాయిదా వేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని స్పీకర్‌‌ను కోరారు. కాగా అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం ఏర్పడింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అక్రమ కట్టడాల పై తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. జగన్ విమర్శలపై స్పందించిన చంద్రబాబు ప్రజావేదిక పక్కనే తాను ఉంటున్న నివాసం తనది కాదని […]

ఆ ఇల్లు నాది కాదు: చంద్రబాబు
Follow us on

ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరును ప్రతిపక్షనేత చంద్రబాబు ఖండించారు. కేబినెట్‌ సమావేశం కోసం అసెంబ్లీని వాయిదా వేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని స్పీకర్‌‌ను కోరారు. కాగా అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం ఏర్పడింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అక్రమ కట్టడాల పై తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.

జగన్ విమర్శలపై స్పందించిన చంద్రబాబు ప్రజావేదిక పక్కనే తాను ఉంటున్న నివాసం తనది కాదని చెప్పారు. రమేష్ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని అన్నారు. తాను ఇక్కడా ఇళ్లు కట్టలేదని.. భూములు తీసుకోలేదని చంద్రబాబు తెలిపారు. ప్రజావేదికను తనకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ పంపితే.. ప్రజావేదికను కూల్చివేశారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై తాను పోరాటానికి సిద్దం అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు.