High Court serious on SEC : హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో షాక్ తగిలింది. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని, మీడియాతో మాట్లాడనివ్వొద్దన్న నిమ్మగడ్డ ఆంక్షలను కొట్టేసింది హైకోర్టు. మొన్ననే సింగిల్ జడ్జి బెంచ్… గృహ నిర్భంధ ఆదేశాలను కొట్టేసింది. మీడియాతో మాట్లాడొద్దన్న ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లారు పెద్దిరెడ్డి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. మీడియాతో మాట్లాడ వచ్చని స్పష్టం చేసింది.
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పీల్‌పై హైకోర్టు ధర్మసనం విచారణ చేపట్టింది. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు పెద్దిరెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని, మీడియాతో కూడా మాట్లాడవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో మళ్లీ అప్పీల్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మీడియాతో మాట్లాడవచ్చని వెల్లడించింది. మాట్లాడవద్దనడానికి రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తికరణ స్వేచ్ఛను హరించినట్లేనని పెద్ది రెడ్డి తరుపున న్యాయవాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై మంత్రి మరోసారి ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం.
ఇదీ చదవండి… గతంలో వారికి పట్టిన గతే వీరికీ పడుతుందన్న మంత్రి అవంతి.. ఇంతకీ ఏమిటా గతీ.. ఎవరికీ శాపనార్థాలు