కోడెలకు మరో షాక్.. కుమార్తెపై కేసు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావుకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఆయన కుమారుడు శివరామకృష్ణ అక్రమాలపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా ఆయన కుమార్తె విజయలక్ష్మిపై కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం కేసానుపల్లిలో భూకబ్జా చేసిన విజయలక్ష్మి తమ వద్ద రూ.15లక్షలు వసూలు చేసినట్లు ఓ భాదితురాలు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు […]

కోడెలకు మరో షాక్.. కుమార్తెపై కేసు

Updated on: Jun 09, 2019 | 11:20 AM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావుకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఆయన కుమారుడు శివరామకృష్ణ అక్రమాలపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా ఆయన కుమార్తె విజయలక్ష్మిపై కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం కేసానుపల్లిలో భూకబ్జా చేసిన విజయలక్ష్మి తమ వద్ద రూ.15లక్షలు వసూలు చేసినట్లు ఓ భాదితురాలు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

అయితే 2014లో విజయం సాధించిన కోడెల తరువాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల కుమారుడు, కుమార్తె పరోక్షంగా ప్రజలను పీడించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరు అందినకాడికి దోచుకున్నారని ఆ నియోజకవర్గ ప్రజలు అనే వారు. జగన్ చేసిన పాదయాత్ర సమయంలోనూ వారు ఇదే విషయాన్ని ఆయన దగ్గర ఏకరువు పెట్టిన విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us