ఆంధ్రాబ్యాంకు పేరును కొనసాగించండి: ఆర్ధిక మంత్రికి చంద్రబాబు లేఖ

| Edited By:

Sep 03, 2019 | 11:15 PM

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బ్యాంకుల విలీనంపై స్పందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే విలీనంలో భాగంగా ఆంధ్రాబ్యాంకు కనుమరుగయ్యే పరిస్థితిపై ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు. విలీనం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం, ఇలాంటి సంస్కరణలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయన్నారు చంద్రబాబు. బ్యాంకుల విలీన ప్రక్రియ మంచిదే అయినా ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని […]

ఆంధ్రాబ్యాంకు పేరును కొనసాగించండి:  ఆర్ధిక మంత్రికి చంద్రబాబు లేఖ
Follow us on

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బ్యాంకుల విలీనంపై స్పందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే విలీనంలో భాగంగా ఆంధ్రాబ్యాంకు కనుమరుగయ్యే పరిస్థితిపై ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు. విలీనం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం, ఇలాంటి సంస్కరణలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయన్నారు చంద్రబాబు. బ్యాంకుల విలీన ప్రక్రియ మంచిదే అయినా ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని మాత్రం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రాబ్యాంకు పేరు కనుమరుగవటం, తెలుగు ప్రజల సెంటిమెంటుతో ముడిపడిఉందని చంద్రబాబు ఆ లేఖలో గుర్తు చేశారు.
స్వాతంత్రానికి ముందే భోగరాజ పట్టాభిసీతారాయయ్య ఆంధ్రాబ్యాంకును స్థాపించారని కూడా బాబు పేర్కొన్నారు.
తెలుగు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రాబ్యాంకు విశేష సేవలందించిందని చెబుతూ విలీనం అనివార్యమైతే ఆంధ్రాబ్యాంక్‌ పేరునే కొనసాగించాలని చంద్రబాబు లేఖలో కోరారు.