40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే సరిపోతుందా..?: జగన్ ఫైర్

| Edited By: Srinu

Jul 18, 2019 | 11:50 AM

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. కరకట్ట అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కరకట్ట పై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడంపై సీఎం జగన్ ప్రస్తావించారు. అక్రమ కట్టడాల వల్లే నగరాల్లో వరద ముప్పు పెరుగుతోందని చెప్పారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎంకైనా.. సామాన్యులకైనా నిబంధనలు ఒక్కటే నని ఆయన గుర్తుచేశారు. ఒక సీఎం అయి ఉండి తానే అలా చేస్తే.. మిగిలిన వాళ్లు […]

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే సరిపోతుందా..?: జగన్ ఫైర్
Follow us on

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. కరకట్ట అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కరకట్ట పై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడంపై సీఎం జగన్ ప్రస్తావించారు. అక్రమ కట్టడాల వల్లే నగరాల్లో వరద ముప్పు పెరుగుతోందని చెప్పారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎంకైనా.. సామాన్యులకైనా నిబంధనలు ఒక్కటే నని ఆయన గుర్తుచేశారు. ఒక సీఎం అయి ఉండి తానే అలా చేస్తే.. మిగిలిన వాళ్లు కూడా అలాగే చేస్తారని అన్నారు. అక్రమ కట్టడాలతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే సరిపోదని.. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. ఇలాంటి రాజకీయ నేతలు ఉన్నంత కాలం వ్యవస్థ బాగుపడదని ఆయన విమర్శించారు.