
పీపీఏలు సమీక్షిస్తామనడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం మిగులు విద్యుత్ సాధించి ఘనత సొంతం చేసుకుందని ఆయన అన్నారు. ఐదేళ్లకు ముందు భారీగా కరెంట్ కోతలు ఉన్నాయని.. వినూత్న కార్యక్రమాలతో పవర్ సెక్టార్‌ను అభివృద్ధి చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు చెబుతున్న రేటు ఎక్కడా విద్యుత్ దొరకలేదని చంద్రబాబు అన్నారు. నోటికి వచ్చిన రేట్లతో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేంద్రం మార్గదర్శకాలను వైసీపీ మార్చి చూపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు వివరణ మాత్రమే ఇవ్వాలని. కానీ ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. థర్మల్ విద్యుత్ వల్ల సమస్యలు వస్తున్నందునే సంప్రదాయేతర విద్యుత్‌పై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. ఇక సీఎం జగన్ ఏర్పాటు చేస్తానన్న జ్యుడిషియల్ కమిషన్ సాధ్యం కాకపోవచ్చని,, కార్యానిర్వాహక వ్యవస్థలో జ్యుడిషియల్ జోక్యం ఉండదని తెలిపారు.