Guntur : గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. ఈ వర్ష బీభత్సానికి పీకల వాగు కూడా పొంగిపొర్లింది. ఈ క్రమంలో శివరాం నగర్ లో నివసించే పుల్లయ్య, మంగమ్మల రెండో కొడుకు కాలువ ఒడ్డున ఆడుకుంటూ పీకలవాగు డ్రెయిన్ లో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్ అన్నయ్య తల్లి దండ్రులకు చెప్పాడు.
అయితే, డ్రెయిన్ వేగంగా ప్రవహిస్తుండటంతో అప్పటికే బాలుడు డ్రైన్ లో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకి కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నగర మేయర్ కావటి మనోహర్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన నిన్న సాయంత్రం ఐదుగంటల సమయంలో జరిగినప్పటికీ ఇప్పటి వరకూ బాలుడు జాడ తెలియరాలేదు. మరోవైపు, బాలుడి తల్లిదండ్రులు చిన్నారి కోసం కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇప్పుడే అందిన వార్త :
గుంటూరు పీకలవాగు లో గల్లంతైన బాలుడు ఆచూకి లభ్యమైంది. సంపత్ నగర్ సమీపంలో బాలుడు మృత దేహం కనిపించింది. గత రాత్రి మెడికల్ క్లబ్ వద్ద పీకలవాగు లో పడి ఐదేళ్ల బాలుడు వెంకటేష్ గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డిఆర్ఎఫ్ , మున్సిపల్ సిబ్బంది తో రాత్రంతా గాలింపు చేపట్టగా ఈ ఉదయం బాలుడు వెంకటేష్ శవమై కనిపించాడు.
కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు.. ముగ్గురు మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కురులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మృతులంతా బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ గుంత దాటుతుండగా.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతులు బీర్కూర్ నుంచి బిచ్కుంద మండటంతోని చెట్లూరు వెళ్తూ.. మంజీరా నది దాటుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటం, దీంతోపాటు గుంతలు ఉండటంతో వారు నీటిలో మునిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరూ మూడు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.
Read also : YS Sharmila : మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు.. ఖబడ్దార్ : వైయస్ షర్మిల