విజయసాయి రెడ్డికి బాలయ్య అల్లుడి కౌంటర్.. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే..

| Edited By: Pardhasaradhi Peri

Oct 20, 2019 | 12:19 PM

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13కోట్లు పై చిలుకు బకాయి పడ్డట్లు ఆ బ్యాంక్ పేపర్లో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు అంటూ విజయసాయి అందులో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు టీడీపీ నేత శ్రీభరత్ స్పందించారు. నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి […]

విజయసాయి రెడ్డికి బాలయ్య అల్లుడి కౌంటర్.. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే..
Follow us on

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13కోట్లు పై చిలుకు బకాయి పడ్డట్లు ఆ బ్యాంక్ పేపర్లో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు అంటూ విజయసాయి అందులో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు టీడీపీ నేత శ్రీభరత్ స్పందించారు.

విజయసాయి రెడ్డి గారు మీ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపిన శ్రీభరత్.. ‘‘ఏపీ ట్రాన్స్ కో నుంచి వీబీసీ రెన్యూబుల్ ఎనర్జీ, మా సంస్థకు రావాల్సిన బకాయిలు దాదాపు రూ.3కోట్లు, బ్యాంక్‌కు మా సంస్థ ఇప్పటి వరకు బకాయిపడ్డ లోన్ వాయిదాలు దాదాపు రూ.2కోట్లు. ట్రాన్స్ కో సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే వాయిదాలు సమయానికి చెల్లించేవాళ్లం. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం’’ అని ట్వీట్ చేశారు.

ఇక ‘‘మన రాష్ట్రంలో చాలా మంది వ్యాపారస్తులు బిల్లులు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కావున మీ సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం. ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివి కావనేది నా అభిప్రాయం’’ అని చెప్పిన శ్రీభరత్.. ఈ మేరకు ఓ లేఖను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.