ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, సీపీఐ రామకృష్ణ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే గుంటూరు జిల్లా మాచర్ల రింగ్ రోడ్ సెంటర్‌లో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద కర్రలతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో వారితో ప్రయాణిస్తోన్న ఓ అడ్వొకేట్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి చేసింది వైసీపీ నేతలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడిని ఖండించిన చంద్రబాబు.. డీజీపీ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.