టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజుని తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను న్యాయస్థానం కొట్టిపారేసింది. దీంతో రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజు కొనసాగనున్నారు.
రామతీర్ధం విగ్రహాల ధ్వంసం సమయంలో ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజును తొలగించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది.
ప్రభుత్వ కక్ష సాధింపు ఆటలు భగవంతుడి ముందు సాగవని ఆశోక్ గజపతి రాజు అన్నారు. ఆ రాముడే తనను దీవించారని ..ఆయన దీవెనలతోనే తాను రామతీర్ధ ఆలయ ధర్మకర్తగా సేవలందిస్తానంటూ అశోక్ గజపతి రాజు ట్వీట్ చేశారు.
The order removing me as the Hereditary Trustee/Chairman of Ramatheerdhalu has been set aside by the Honorable High Court today. I saw in news that it is the Prathista at Ramatheerdhalu today. Lord Rama blessed me on this auspicious day to continue in his service. pic.twitter.com/OiFWuwstTu
— Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 28, 2021