జెరూసలెం యాత్రికులకు జగన్ కానుక.. అదేంటంటే.?

|

Nov 20, 2019 | 12:06 AM

ఏపీ పాలిటిక్స్ రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక వైపు మతపరమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ సర్కార్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో వాటికి ఇంకా ఆజ్యం పోసింది. అదేంటంటే.. జెరూసలెం యాత్రకు వెళ్లాలనుకునే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.40 వేలు ఆర్ధిక సాయం ఇవ్వగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. ఇక ఈ ఆర్ధిక సాయానికి రూ.3 లక్షలలోపు […]

జెరూసలెం యాత్రికులకు జగన్ కానుక.. అదేంటంటే.?
Follow us on

ఏపీ పాలిటిక్స్ రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక వైపు మతపరమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ సర్కార్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో వాటికి ఇంకా ఆజ్యం పోసింది. అదేంటంటే.. జెరూసలెం యాత్రకు వెళ్లాలనుకునే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.40 వేలు ఆర్ధిక సాయం ఇవ్వగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. ఇక ఈ ఆర్ధిక సాయానికి రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన వారు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కూడా పెంచారు. ఇకపై రూ.20 వేలకు బదులుగా వారికి రూ.30 వేలు ఇవ్వనున్నారు. దీంతో జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రైస్తవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక మతపరమైన కోణం ఉందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ విమర్శలకు వైసీపీ నేతలు కూడా ధీటుగానే జవాబిస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి రగడకు దారి తీస్తుందో వేచి చూడాలి.