మరికాసేపట్లో సచివాలయానికి సీఎం వైఎస్ జగన్.. బడ్జెట్ కేటాయింపులు, నవరత్నాల అమలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈరోజు సచివాలయానికి రానున్నారు. బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష.

మరికాసేపట్లో సచివాలయానికి సీఎం వైఎస్ జగన్.. బడ్జెట్ కేటాయింపులు, నవరత్నాల అమలపై చర్చ
AP CM YS Jagan

Updated on: Feb 10, 2021 | 10:57 AM

YS Jagan to secretariat : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈరోజు సచివాలయానికి రానున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇవాళ సచివాలయానికి జగన్ రానున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని ఒకటవ బ్లాక్‌లో సీనియర్ అధికారులతో సీఎం సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఎం శాఖలవారీ సమీక్ష చేస్తారు. ఇందులో భాగంగా బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగిన అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

అలాగే, నవరత్నాలపై ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో బుధవారం సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు పలువురు ముఖ్య ప్రతినిధులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమావేశమవుతారు.

ఇదీ చదవండి… YS Sharmila Politics In Telangana Video: తెలంగాణలో రాజన్న రాజ్యం.. తెలంగాణ ప్రజలకు షర్మిల ఏం చెబుతారు?’..