Guntur: ‘హమ్మయ్య.. ఇప్పుడైతే ఎవ్వరూ ఎత్తుకెళ్లలేరు’ లాఠీకి తాళం వేసిన పోలీస్..

| Edited By: Srilakshmi C

Oct 03, 2023 | 4:07 PM

నికుడికి తుపాకి ఎంత ముఖ్యమో పోలీస్‌కి లాఠీ అంతే ముఖ్యం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు లాఠీలను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో పోలీసుల లాఠీలను జాగ్రత్తగా భద్ర పరుచుకుంటారు. అయితే గుంటూరులో పోలీస్ ద్విచక్ర వాహనాలకే భద్రత లేకుండా పోయింది. రెండు వారాల క్రితం ఒక మహిళా కానిస్టేబుల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి వచ్చింది. గ్రౌండ్‌లో ఎస్సై సెలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ మహిళా కానిస్టేబుల్‌కి డ్యూటీ వేశారు. దీంతో ఆమె ద్విచక్ర వాహనంపై..

Guntur: హమ్మయ్య.. ఇప్పుడైతే ఎవ్వరూ ఎత్తుకెళ్లలేరు లాఠీకి తాళం వేసిన పోలీస్..
Lathi Locked With Bike
Follow us on

గుంటూరు, అక్టోబర్‌ 3: సైనికుడికి తుపాకి ఎంత ముఖ్యమో పోలీస్‌కి లాఠీ అంతే ముఖ్యం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు లాఠీలను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో పోలీసుల లాఠీలను జాగ్రత్తగా భద్ర పరుచుకుంటారు. అయితే గుంటూరులో పోలీస్ ద్విచక్ర వాహనాలకే భద్రత లేకుండా పోయింది. రెండు వారాల క్రితం ఒక మహిళా కానిస్టేబుల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి వచ్చింది. గ్రౌండ్‌లో ఎస్సై సెలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ మహిళా కానిస్టేబుల్‌కి డ్యూటీ వేశారు. దీంతో ఆమె ద్విచక్ర వాహనంపై పరేడ్ గ్రౌండ్‌కి వచ్చింది. బయట బండి పార్క్ చేసి గ్రౌండ్‌లోకి వెళ్ళి విధి నిర్వహణలో పాల్గొంది. డ్యూటీ అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. బైక్ చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలోనే కానిస్టేబుల్స్ కూడా అప్రమత్తమయ్యారు. విధి నిర్వహణలో భాగంగా బైక్ పై వచ్చే కానిస్టేబుల్స్ తమ ఆయుధమైన లాఠీని బైక్ పక్కనే అమర్చుకొని వస్తారు. అయితే విధి నిర్వహణలో ఎక్కడెక్కడకో వెళ్ళి తర్వాత బైక్ వద్దకు వచ్చి చూస్తే లాఠీ కనిపించడం లేదు. దీంతో ఓ కానిస్టేబుల్ వినూత్నంగా ఆలోచించాడు. లాఠీకి బైక్ వైర్ కలిపి లాక్ వేశాడు. దీంతో లాఠీకి భద్రత ఏర్పడింది. బైక్ స్టాండ్ లో పార్క్ చేసి విధి నిర్వహణ తర్వాత వచ్చినా లాఠీ మాత్రం పోవడం లేదు. దీంతో సదరు కానిస్టేబుల్ ప్రయోగాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఈ రోజు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేసి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధుల్లో భాగంగా వచ్చిన ఓ కాని స్టేబుల్ లాఠీకి బైక్ తాళం వేయటాన్ని చూసి పలువురు ముక్కున వేలు వేసుకొని చూశారు‌. మరి కొందరు మాత్రం పోలీస్ వస్తువులకే భద్రత లేకుండా పోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా లాఠీకి తాళం వేయడం మాత్రం అందరిని ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.