Amaravathi: రాజధాని అమరావతిలో కీలక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. వేగవంతంగా జర్నీ..

రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ఎప్పటినుంచో కొనసాగుతుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభమైంది. గురువారం సీఎం చంద్రబాబు ఈ రోడ్డును ప్రారంభించారు. అలాగే రెండు స్టీల్ బ్రిడ్జిలకు కూడా ప్రారంభోత్సవం చేశారు. వీటి వివరాలు చూస్తే..

Amaravathi: రాజధాని అమరావతిలో కీలక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. వేగవంతంగా జర్నీ..
Amaravathi

Updated on: Aug 13, 2026 | 12:35 PM

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు ఊపందుకున్నాయి. పూర్తి అయిన అభివృద్ది పనులను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు.  ఈ సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాయపూడి – వెంకటపాలెం – పెనుమాక – ఉండవల్లి వరకూ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి 16కు అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనుండగా.. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంతో రాజధాని నగరానికి మరింత మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.

ఇవాళ్టి నుంచి కరకట్టకు ప్రత్యామ్నాయంగా సీడ్ యాక్సెస్ రహదారి మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమం అయింది. రాజధానిని ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండనుందని చెప్పవచ్చు. అమరావతిలో ప్రజా రవాణాకు ఇది పెద్ద వెన్నెముకగా నిలవనుంది. విజయవాడ-మంగళగిరి మార్గానికి సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానం చేశారు. దీంతో రవాణా మరింత వేగవంతం కానుంది. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా అమరావతికి ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు. మూడు దశల్లో ఈ  రోడ్డు నిర్మాణం చేపట్టారు.  ఎన్ -1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ఎన్-సిరీస్ రహదారులను యాక్సెస్ రోడ్డుతో అనుసంధానించారు.

1.77 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉండనుండగా.. ఇందుకోసం రూ.1519 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మిస్తుండగా.. సర్వీస్ రోడ్లతో పాటు ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, 9 లైన్ల రహదారి ఉన్నాయి. ఇక సైకిల్ ట్రాకులు, ఫుట్ పాత్‌లు కూడా ఉన్నాయి. బుకింగ్ హోమ్‌పై నిర్మించి స్టీల్ బ్రిడ్జి 110 మీటర్ల పొడవు, 9+9 మీట‌ర్లు వెడల్పు ఉంటుంది. ఇక కొండవీటి వాగుపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పొడవు 284 మీటర్లుగా ఉండగా.. 11 మీటర్లు వెడల్పు ఉంది. ఈ రెండు వంతెలను కూడా ప్రారంభించడతో విజయవాడ నుంచి అమరావతికి కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఈ రోడ్డు ప్రారంభంతో రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us