AICC President Elections: కర్నూలు వేదికగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక.. నియోజకవర్గం నుంచి ఇద్దరికే అవకాశం..

|

Oct 17, 2022 | 7:08 AM

సోమవారం జరగనున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కు కర్నూలు వేదిక అయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో కర్నూలు జిల్లా కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి..

AICC President Elections: కర్నూలు వేదికగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక.. నియోజకవర్గం నుంచి ఇద్దరికే అవకాశం..
Kunool
Follow us on

సోమవారం జరగనున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కు కర్నూలు వేదిక అయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో కర్నూలు జిల్లా కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పిసిసి డెలిగేట్స్ అందరూ కూడా కర్నూలులోనే ఓటు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనే డెలిగేట్స్ అందరూ కర్నూలు చేరుకున్నారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు పీసీసీ డెలిగేట్స్ ఉన్నారు 350 మంది డెలిగేట్స్ తన ఓటు హక్కును కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోనున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ తో పాటు కేవీపీ రామచంద్రరావు లాంటి ముఖ్య నేతలు అంతా కర్నూలు చేరుకున్నారు. 1962 నుంచి 64 వరకు 71 నుంచి 72 వరకు కర్నూలు జిల్లాకు చెందిన దళిత నేత దామోదరం సంజీవయ్య ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవిలో ఉండగానే మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేంద్రంతో కర్నూలుకు ఎంతో ప్రాధాన్యత లభించినట్లయినది.

కాగా.. పోలింగ్ ఉదయం పదిగంటల నుంచి 4 గంటల వరకు జరగనుంది. ఈరోజే సాయంత్రానికి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఆంధ్రా – కర్ణాటక సరిహద్దు ఆలూరు చెక్ పోస్ట్ వద్దకు చేరుకుంటుంది. ఓటు హక్కు వినియోగించుకున్న డెలిగేట్స్ అందరూ సరిహద్దులో రాహుల్ గాంధీని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలపనున్నారు. మంగళవారం నుంచి 21 వరకు కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగి, అనంతరం తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఎఐసీసీ అధ్యక్షులుగా మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ పోటీలో ఉన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఓటు వేసేందుకు పీసీసీ ప్రతినిధులుగా ఇద్దరికి అవకాశం లభించనుంది. ఓటింగ్ కోసం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కు ఎన్నికల అధికారిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ వ్యవహరించనున్నారు.

మరోవైపు.. దేశవ్యాప్తంగా 36 పోలింగ్ స్టేషన్లలో 67 పోలింగ్ బూత్‌లను అధ్యక్ష ఎన్నికల కోసం ఏర్పాటు చేశారు. 9,300 మందికి పైగా ప్రతినిధులు పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున, ఢిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లో మున్సిపల్ సీటు ప్రాతిపదికన ప్రతినిధులను ఎంపిక చేశారు. భారత్ జోడోయాత్రలో భాగంగా ప్రత్యేకంగా యాత్ర క్యాంపు వద్ద ఒక బూత్ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి తరలించి, ఈనెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేరోజు ఫలితాన్ని వెలువరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..