Aghora Hulchul: విశాఖలో రోడ్లమీద తిరుగుతూ అఘోరా బీభత్సం.. గంజాయి సేవించి వీరంగం

Aghora Hulchul: విశాఖపట్నం(Visakhapatnam)లో అఘోరాలు బీభత్సం సృష్టించారు. నర్సీపట్నం (Narsipatnam) లోని రోడ్డులో రోడ్లపై తిరుగుతూ పెద్ద వీరంగం చేశారు. గంజాయి సేవించి కృష్ణ బజార్‌ సెంటర్‌..

Aghora Hulchul: విశాఖలో రోడ్లమీద తిరుగుతూ అఘోరా బీభత్సం.. గంజాయి సేవించి వీరంగం
Aghora In Visakha

Updated on: Feb 11, 2022 | 10:35 AM

Aghora Hulchul: విశాఖపట్నం(Visakhapatnam)లో అఘోరాలు బీభత్సం సృష్టించారు. నర్సీపట్నం (Narsipatnam) లోని రోడ్డులో రోడ్లపై తిరుగుతూ పెద్ద వీరంగం చేశారు. గంజాయి సేవించి కృష్ణ బజార్‌ సెంటర్‌(Krishna Bazar Centerలో వచ్చీ పోయే వాహనాలు ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. అఖండ సినిమా చూసేందుకు వచ్చిన వీరు ఈసారి వాహనాలు అపుతూ హల్ చల్ చేశారు. స్థానిక కృష్ణాబజార్ సెంటర్లో అప్పటికే గంజాయి తాగి ఉన్న వీరు బట్టల్లేకుండా అటు, ఇటు తిరుగుతూ ఆ రోడ్డు గుండా వచ్చే వాహనాలను ఆపుతూ వీరంగం సృష్టించారు. వాహనాలకు అడ్డుగా వెళ్లడం, డబ్బులిమ్మంటూ డిమాండ్‌ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురి చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా నిలిచిపోయిన వాహనాలతో రద్దీగా మారింది. ఇదే సమయంలో ఫస్ట్ షో సినిమా చూసి అటుగా వచ్చే స్థానికులు అటుగా వెళ్లేందుకు భయపడి, మరో దారి గుండా ఇళ్లకు చేరుకున్నారు. ఇంతలో స్థానికులు పోలీసులకు సమారాచం అందించారు.. విషయం గ్రహించిన అఘోరాలు అక్కడినుంచి పరారయ్యారు.