Kurudi Coconut: యువరైతు ఆదర్శ వ్యవసాయం.. కొత్త ఆలోచనతో కురిడి కొబ్బరి.. లక్షల్లో లాభాలు..

Kurudi Coconut Farming: వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఓ యువ రైతు. ఆ ప్రయోగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ రైతు చేసిన పనేంటి?

Kurudi Coconut: యువరైతు ఆదర్శ వ్యవసాయం.. కొత్త ఆలోచనతో కురిడి కొబ్బరి.. లక్షల్లో లాభాలు..
Kurudi Coconut Farming

Updated on: Mar 18, 2022 | 7:02 AM

కొబ్బరిని అమృతభాండము అని కూడా అంటారు. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని(Coconut Tree) ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పన్నాలు, కొబ్బరి నీరు ఆధారంగా ఉత్పన్నాలు, కొబ్బరి టెంక , కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు ప్రధానమైనవి. కొబ్బరి చెట్టు ఆధారంతో చేతితో తయారుచేసిన అలంకార వస్తువులు ముందంజలో ఉన్నాయి. కుటీర పరిశ్రమలకు అనువైన కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు,కొబ్బరి వినియోగాలు చాలా ఉన్నాయి. అయితే సాధారణంగా కొబ్బరికాయలు చెట్టుపై నుంచి దింపి, వాటిని మార్కెట్లో విక్రయిస్తే, ఏడు రూపాయల ధర పలుకుతుంది. అదే కొబ్బరికాయను తొమ్మిది నెలల పాటు ఆటకలపై ఆరబెట్టి, అది కురిడి కొబ్బరికాయగా మారిన తరువాత అమ్మితే, రైతుకు మంచి లాభాలు వస్తాయి. ఇదే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ఓ యువ రైతు.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం లూటుకూర్రు గ్రామంలో యువ రైతు, బోనం బాబు వినూత్న ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.  వెయ్యి కొబ్బరికాయలకు 10 వేల ధర పలుకుతుంది. దానివల్ల రైతుకు అదనంగా లాభం చేకూరుతుంది. పూర్వం పెంకుటిళ్లకు అటకలు అమర్చి, వాటిపై కొబ్బరి కాయలు ఆరబెట్టేవారు.

పెంకుటిల్లు కనుమరుగై వాటి స్థానంలో బిల్డింగులు రావడంతో, ఆరబెట్టి అమ్ముకునే వ్యాపారానికి ఆటంకం ఏర్పడింది. దీంతో బోనం బాబు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చెట్టుకు చెట్టుకు మధ్యలో సర్వే కర్రలు అడ్డంగా కట్టి, కొబ్బరికాయలను గుత్తులుగా గుచ్చి వేలాడదీశాడు. దీంతో మూడు నెలలకే కురిడి కొబ్బరికాయ మారుతుందని చెబుతున్నారు బాబు. ఈ ప్రయోగం వల్ల శ్రమ, ఖర్చులు తగ్గి రాబడి పెరుగుతోందని చెబుతున్నారు యువ రైతు. మిగతా రైతులు ఈ విధానాన్నే అమలు చేస్తే, మంచి లాభాలు వస్తాయని అంటున్నారు బోనం బాబు సూచించారు.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.

Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..

Follow Us