Andhra Pradesh: విశాఖలో వింత పాము హల్‌చల్.. ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా?

|

Aug 26, 2022 | 3:01 PM

Andhra Pradesh: విశాఖలో అరుదైన కుక్క మూతి నీటిపాము కనిపించింది. కాన్వెంట్ జంక్షన్ పరిశ్రమల ప్రాంతంలో.. బురదలో ఉన్నట్టు గుర్తించి సమాచారాన్ని పాములు..

Andhra Pradesh: విశాఖలో వింత పాము హల్‌చల్.. ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా?
Dog Faced Snake
Follow us on

Andhra Pradesh: విశాఖలో అరుదైన కుక్క మూతి నీటిపాము కనిపించింది. కాన్వెంట్ జంక్షన్ పరిశ్రమల ప్రాంతంలో.. బురదలో ఉన్నట్టు గుర్తించి సమాచారాన్ని పాములు పట్టే నేర్పరి స్నేహ కిరణ్ కు అందించారు. పాము ఉన్న ప్రాంతానికి చేరుకున్న స్నేక్ కిరణ్.. అత్యంత చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. అరుదైన కుక్క మూతి నీటిపామును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పామును తీసుకెళ్లి ఆర్కే బీచ్ సముద్రంలో వదిలేశారు. అయితే.. సాల్ట్ కోబ్రా గా పిలవబడే ఈ పాము.. తీర ప్రాంతాల్లో ఉంటుంది. మడ అడవులు, బురద నేలలు వీటి ఆవాసం. నీటిలో ఉండే కీటకాలు చేపలను తింటుంది. ఈ పాము కాటు వేస్తే.. కండరాల్లో కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. మందు కూడా అంత ప్రభావవంతంగా పనిచేయదట. పాములు పట్టే తన 20 ఏళ్ల జీవితంలో వివిధ రకాల 25 వేలకు పైగా పాములను చూసినా.. ఈ కుక్క మూతి నీటిపామును ఎప్పుడూ చూడలేదని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్.

-ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..