జాను కోసం కదిలిన భైరవుడు.. జీపీఎస్ ట్రాకర్‌తో రంగంలోకి పెట్ డాగ్.. పాప మిస్సింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ ఇదే..

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోగా, ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. తాజాగా రెండోసారి కనిపించిన కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

జాను కోసం కదిలిన భైరవుడు.. జీపీఎస్ ట్రాకర్‌తో రంగంలోకి పెట్ డాగ్.. పాప మిస్సింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ ఇదే..
Jahnavi Missing Case

Updated on: Jun 12, 2026 | 7:23 PM

కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారి.. సడెన్‌గా కనిపించకుండా పోవడం ఏపీలో కలకలం రేపింది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తోంది. దొండవాక గ్రామ శివారులోని పామాయిల్‌ తోటలో కాపలా ఉండే దంపతుల కూతురు జాహ్నవి ఆడుకుంటూ వెళ్లి మిస్సయింది. దీంతో.. అప్రమత్తమైన తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు పామాయిల్‌ తోటలతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోనూ గాలించారు. అయితే.. పాపతోపాటు పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డ్రోన్లు, డాగ్‌ స్క్వాడ్‌, SDRF బృందాలతో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. పామాయిల్‌ తోట చుట్టుపక్కల అడవి, కొండ ప్రాంతం కావడంతో రిస్క్ పొజిషన్‌లోనూ రెస్క్యూ కొనసాగిస్తున్నారు. చిన్నారి జాహ్నవి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. డ్రోన్ల సాయంతో ఘటనాస్థలం చుట్టుపక్కలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే.. వెంట వెళ్లిన కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. మరి జాహ్నవి జాడేది అనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలోనే.. జ్ఞానేశ్వరి అలియాస్‌ జాహ్నవి మిస్సింగ్‌ కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండోసారి అదృశ్యమైన పెంపుడు కుక్కను డాగ్‌ క్యాచర్ బృందం పట్టుకుంది.. అనంతరం తుని మున్సిపల్ కమిషనర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ప్రస్తుతం పోలీసులు ఆ కుక్క కదలికలపై నిఘా ఉంచారు. దాని ద్వారా చిన్నారి ఆచూకీకి సంబంధించిన కీలక ఆధారాలు లభిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. ఈ మేరకు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. జాహ్నవి కోసం సెర్చ్ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు.

వీడియో చూడండి..


కుక్కను జీపీఎస్ ట్రాకర్ అమర్చి విడిచిపెట్టి అది.. ఎటు వైపు వెళ్తుంది..? అనేది క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కుక్క వెళ్లిన జాడలు, జాహ్నవి తల్లి వ్యక్తం చేసిన అనుమానాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాదాపు 200 మంది వరకు ఆపరేషన్ జానులో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. దీని గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు పాప మిస్సింగ్‌పై చిన్న క్లూ కూడా లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అటవీ ప్రాంతం కావడంతో జరగరానిది ఏమైనా జరిగిందా?.. లేక.. బాలికను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?.. పొరపాటున అడవిలోకి వెళ్లిందా?.. అనేది అంతుచిక్కడం లేదు.. ఇప్పటికే.. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. పాప కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నారు.

Follow Us