Chandrababu: అదే బ్యాడ్.. అదే గుడ్.. టీడీపీకి మిస్టరీ నంబర్‌గా మారిన 23

|

Mar 23, 2023 | 8:49 PM

23--- ఈ నంబర్‌తో టీడీపీకి విడదీయరాని అనుబంధం ఉందా అనిపిస్తుంది. ఇవాళ డేట్ ఏంటి..? అనురాధకు ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఇది ఏ ఇయర్.. ఇవి మాత్రమే కాదు....

Chandrababu: అదే బ్యాడ్.. అదే గుడ్.. టీడీపీకి మిస్టరీ నంబర్‌గా మారిన 23
CHANDRABABU NAIDU
Follow us on

ఏపీలోని ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది. టీడీపీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థిని పంచుమర్తి అనురాధ విజయం సాధించింది. ఆమె గెలవాలంటే.. వాస్తవానికి 22 ఓట్లు కావాలి. కానీ ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ టీడీపీ బరిలోకి దిగి.. అనూహ్య విజయం సాధించింది. టీడీపీ గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ .. అధికార వైసీపీకి మద్దతు పలికారు. దీంతో ఆ పార్టీ బలం 19కి పడిపోయింది. ఒకవేళ వైసీపీపై అసమ్మతి గళం వినిపిస్తున్న.. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. టీడీపీకి ఓటు వేశారు అనుకున్నా.. టీడీపీ బలం 21కి చేరేది. కానీ అనురాధకు 23 ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి.. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పక్కాగా స్పష్టమవుతుంది.

ఆ 23 చుట్టే టీడీపీ రాజకీయం

2014 ఎన్నికల్లో టీడీపీ 102 సీట్లు సాధించి అధికార పీఠం దక్కించుకుంది.. వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత కాలంలో.. దాదాపు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అప్పటి అధికార టీడీపీలోకి జంప్ అయ్యారు. కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయకేతనం ఎగరవేసింది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. తమ పార్టీ నుంచి లాక్కున్నఎమ్మెల్యేల సంఖ్యే ప్రస్తుతం టీడీపీకి మిగిలిందని వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎద్దేవా చేసేవారు. కట్ చేస్తే ఇది మూడవ నెల… 23వ… తారీఖు 2023వ సంవత్సరం(23-3-2023). ఇదే రోజున 23 ఓట్లతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించారు. ఇదంతా చూస్తుంటే.. 23 సంఖ్యతో టీడీపీకి విడధీయరాని అనుబంధం ఉందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..