Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 2వ తేదీన జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నట్లు గతంలోనే బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్రకటన విడుదల చేసిన విషయం..

Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే.
AP 10th supplementary exams

Updated on: Jun 01, 2023 | 6:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 2వ తేదీన జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నట్లు గతంలోనే బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద‌యం 9:30 గంట‌ల‌కు నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు కొనసాగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

రేపటి నుంచి జూన్‌ 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 2న ఫ‌స్ట్ లాంగ్వేజ్, జూన్ 3న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 5న ఇంగ్లీష్‌, జూన్ 6 మ్యాథ్స్, జూన్ 7న సైన్స్, జూన్ 8న సోష‌ల్ స్టడీస్‌, జూన్ 9న ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్ -2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 1, జూన్ 10న ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు.

పరీక్షా హాల్‌లోకి చీఫ్‌ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌లాంటి పరికరాలను పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లకూడదని అధికారులు తెలిపారు. జూన్‌ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరగనుంది. ఇదిలా ఉంటే ఉంటే ఏపీలో మే 6వ తేదీన టెన్త్‌ పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us