Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టరు బోల్తా పడిన ఘటనలో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని రాయదుర్గం మండలంలోని ఉడేగోళం గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
రేకులకుంట గ్రామానికి చెందిన ఓ రాజకీయపార్టీ మద్దతుదారుడి నామినేషన్ కార్యక్రమానికి వీరంతా వెళ్లివస్తుండగా… ట్రాక్టరు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం మెరుగైన చికిత్స కోసం వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై రాళ్ల దాడి.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్న యువకుడు